![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -433 లో... మధుపై ఆదర్శ్ కోపంగా అరుస్తుంటే ఇంట్లోని వాళ్ళంతా వస్తారు. భవాని వచ్చి... ఎందుకు అలా అరుస్తున్నావంటు ఆదర్శ్ ని అడుగగా.. వీళ్ళెవరు నన్ను నీ కోడుకులా చూడడం లేదని ఆదర్శ్ అంటాడు.
తనకోసమే మేమంతా చేస్తున్నాం. అయిన తనకి అర్థం కావడం లేదు.. ఇంకా ఏం చెయ్యాలో అడగండి అత్తయ్య అని కృష్ణ అనగానే... అడుగుతుంది కదా, చెప్పు.. నీ దృష్టిలో ఇంత ప్రేమగా పెంచిన నేను కూడా పరాయిదాన్నే అయిపోయాను కదా.. చెప్పు నీకోసం ఏం చేస్తే నువ్వు మా ప్రేమను అర్థం చేసుకుంటావని ఆదర్శ్ తో భవాని అంటుంది. ఇంటితో సహా మొత్తం ఆస్తి నా పేరున రాసెయ్ అమ్మా.. అప్పుడు నేను ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయిస్తానని ఆదర్శ్ అంటాడు. వెంటనే భవాని అదర్శ్ ని లాగిపెట్టి కొట్టేస్తుంది. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళంతా నా ప్రాణం. వాళ్లని దూరం చేసుకుని నన్ను బతకమంటావా? నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటు ఆదర్శ్ ని భవాని తిట్టేస్తుంది. అప్పుడే పక్కనే ఉన్న మీరా.. ఈ అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటుంది. భవానికి అడ్డుగా వెళ్ళి.. మేడమ్.. మీరు ఆవేశపడకండి. తను ఏదో తాగేసి అలా మాట్లాడుతున్నారు. నేను నెమ్మదిగా నచ్చజెబుతానంటు గొడవను ఆపేసి.. ఆదర్శ్ మనసులో మార్కులు కొట్టేస్తుంది మీరా. ఆ తర్వాత ఆదర్శ్ కి మందు తాగిస్తూ నాలుగు మంచిమాటలు చెప్తూ తనని నమ్మేలా చేసుకుంటుంది మీరా. కాసేపటికి మురారీ బాధగా ఆదర్శ్ దగ్గరకు వస్తాడు. రేయ్ నేను నీ మురారీనిరా.. నేను తప్పు చేశానంటే నమ్ముతున్నావా అంటు మురారి మాట్లాడటానికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆదర్శ్ ఊరుకోడు. రేయ్ పోరా ఇక్కడ నుంచి.. మీరా తనను వెళ్లిపోమని చెప్పు అంటు రెచ్చిపోతాడు. దాంతో మీరా.. మురారీ గారు నాతో రండి అంటు తనను పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడుతుంది. నచ్చజెబుతుంది. మురారీ బాధపడుతుంటే. కావాలనే ప్రేమగా మురారీ చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. మురారి కళ్ళలోకి మీరా చూస్తూ.. కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి అన్నీ సర్దుకుంటాయని చెప్తుంది. కాసేపటికి మురారి అక్కడి నుండి వెళతాడు.
భవాని దగ్గరికి కృష్ణ వెళ్ళి.. తన సంతోషం కోసం చేశా కదా అత్తమ్మ అని అంటుంది.అవునని తనని భాదపడవద్దని అన్నీ త్వరలోనే తెలుస్తాయని భవాని అంటుంది. ఇక తరువాయి భాగంలో..ఇంటి గేట్ అవతల నిలబడి శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడుతుంది. ఏంటో ఇంత పలుకుబడి ఉంది.. అంత పలుకుబడి ఉంది అంటావ్. ఒక ఇల్లు అమ్మడానికి ఇన్ని పాట్లు పడుతున్నావ్.. సరే నాన్నా ఉంటానంటూ మాట్లాడిన ముకుంద మాటలు.. అక్కడే వెనుకవైపు పువ్వులు కోస్తున్న కృష్ణ చెవిన పడతాయి. ఇదేంటి మీరా.. నాన్న అంటోంది? తను అనాథ కాదా? మరి ఎందుకు అలా చెప్పిందంటూ నిలదీయడానికి మీరా ముందుకు కృష్ణ వెళ్తుంది. అయితే మీరా ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటుందా? అనుమానాలను రేకెత్తించేలా ప్రవర్తిస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |